Voters are Surprised | స్నేహమంటే ఇదేరా…

Voters are Surprised | స్నేహమంటే ఇదేరా…
Voters are Surprised | వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : ఎన్నికలంటే కక్షలు.. వ్యక్తిగత విమర్శలు.. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడం ఇలా ఎన్నో సంఘటనలు చూస్తుంటాం. కానీ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో (miraasipalli) మాత్రం లోపాల పోలింగ్ జరుగుతుంటే బయట అభ్యర్థులు ఇద్దరూ స్నేహ పూర్వకంగా మాట్లాడుతున్న దృశ్యం ఓటర్ల కంట కనిపించింది. దీంతో ఓటర్లు ఆశ్చర్యానందం వ్యక్తం చేశారు.
కొత్తకోట మండలం మిరాసిపల్లి సర్పంచ్ పదవికి హోరాహోరీగా పోటీ జరుగుతుంది. అభ్యర్థులు ఇద్దరు మాధవి, రాజేశ్వరి (Madhavi, Rajeswari) మధ్యలో ఎంతో ఆసక్తికరంగా పోటీ ఉంది. ఈ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద వారిద్దరూ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం ఓటర్లు కంట పడింది. వారిద్దరి పోటీ బ్యాలెట్‌లోనే మాత్రమే… ఇక్కడ ఎంత స్నేహంగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారో చూడ ముచ్చటగా ఉందని పలువురు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
