Bodhan | నూతన సర్పంచులకు అభినంద‌న‌

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, వార్డు సభ్యులకు ఆరు గ్యారెంటీల ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆదివారం బోధన్, సాలురా మండలాల గ్రామాలలో గెలిచిన సర్పంచులను ఆయన అభినందించారు. ప్రజలకు పథకాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచుల పైనే ఉంటుందన్నారు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వ‌మ్ము చేయొద్ద‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు గంగా శంకర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply