THE NATURE | ఎర్రమల అటవీ అందాలు చూసొద్దాం

THE NATURE | ఎర్రమల అటవీ అందాలు చూసొద్దాం
- పర్యాటకులను కనువిందు చేస్తున్న ఎర్రమల అందాలు
- ఆరు మండలాల్లో విస్తరించిన ఎర్రమల ఫారెస్ట్
- ఏపీలో అతిపెద్ద ప్రాంతంగా ఎర్రమలకు గుర్తింపు
అవుకు రూరల్, ఆంధ్రప్రభ : అందాలలోఅహో మహోదయం, భూలోకమే నవోదయం.. పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేల జుంబించే లాలిలో.. అంటూ పాటను ఓ సినీ గేయ రచయిత పకృతి అందాలను వర్ణిస్తూ ఓ క్లాసిక్ తెలుగు ప్రేమ గీతాన్ని(Telugu love song) పకృతి ప్రేమికులకు అందించారు. అలాంటి అందాలను చూడాలంటే ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద అటవీ ప్రాంతమైన ఎర్రమల అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడి అందాలను చూడాల్సిందే.. పచ్చని చెట్లు.. సహజ సిద్ధమైన(Natural preparation) పకృతి అందాలు, పక్షులు కిలకిలలు, చెట్ల గలగలలు నదుల ప్రవాహం వంటి ప్రకృతి వర్ణనలు ఎర్రమల అటవీ ప్రాంతానికే సొంతమని చెప్పవచ్చు… పూర్తి వివరాల్లోకెళ్తే అవుకు మండలంలోని ఎర్రమల అటవీ ప్రాంతం పూర్తి విస్తీర్ణ41 వేల హెక్టార్లలో, కంపార్ట్మెంట్లలో కలిపి నంద్యాల జిల్లాలోని ఆరు మండలా ల్లో(అవుకు, కోవెలకుంట్ల, సంజామల కొలిమిగుండ్ల ఉయ్యాలవాడ దొర్నిపాడు మండలాల్లో విస్తరించి ఉంది. ఈ ఎర్రమల ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద అటవీ ప్రాంతం(Large forest area)గా గుర్తింపు ఉన్నట్లు అటవీశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

THE NATURE | సహజ సిద్ధమైన రాతి అందాలు
అవుకు మండలంలోని కునుకుంట మారేమడుగుల, కొండమ నాయుని పల్లి తదితర ప్రాంతాల్లోని దేవ గుండాలు, (దేవకన్యకలు స్నానమాచరించిన ప్రాంతం) తిరువెంగళయ్య స్వామి ప్రాంతాల్లో సహజ సిద్ధమైన ఎర్ర రాతి అందా లు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాల్లో పచ్చదనంతో కప్పుకున్న పచ్చని చెట్లు, జాలు వారే సెలయేర్ల శబ్దాలు, చిన్నపాటి నదులను తలపించే
