Police | సస్పెండ్..

Police | సస్పెండ్..
Police, చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : ఈ నెల 4వ తేదీ చిలకలూరిపేట బైపాస్ రోడ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నశీను కుమారుడు వెంకట్ నాయుడు ముఠా కారణమని పోలీస్ విచారణలో తేలింది. అయితే.. ఈ ముఠాతో చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రహమతుల్లాకు సంబంధం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో ఎస్పీ కృష్ణారావు శనివారం రాత్రి ఎస్ఐ రహమతుల్లాహ్ ను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. అసలు నిందితుడు వెంకట్ నాయుడు తండ్రి ఏఎస్ఐ శీనుని వెల్దుర్తికి బదిలీ చేసి ఎస్సై రహమతుల్లాను సస్పెండ్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ముఠా చేసిన అక్రమాలు, దొంగతనాలు వెలికి తీస్తారా లేదా అని కోణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు.
