MLA Office | గ్రామాభివృద్ధికి నిరంతరం పనిచేస్తా…
- ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేను కలిసిన గ్రామ సర్పంచ్ కాడవేన సరిత – యుగెంధర్…..
MLA Office రేగొండ, ఆంధ్రప్రభ : గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ కాడవేణ సరిత- యుగేందర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సహకారంతో నిరంతరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, గ్రామ సర్పంచ్ కాడవేన సరిత – యుగెంధర్ అన్నారు. ఇవాళ భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ను గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి, స్వీటు తినిపించారు. అనంతరం సర్పంచ్, వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 338 ఓట్ల మెజారిటీతో గెలిపించిన వెంకటేశ్వర్లపల్లి ప్రజలందరికీ రుణపడి పడిఉంటానన్నారు. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. గ్రామంలోని నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు నాయినేని సంపత్ రావు, నాయకులు చిగురుమామిడి కుమారస్వామి, గ్రామ కమిటీ అధ్యక్షులు బోయిని కుమారస్వామి, గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు బొల్ల చిరంజీవి, సూరంవీరేందర్, చిగురుమామిడి రాజు, పొనుగోటివీరబ్రహ్మం, కాడవేణి అశోక్, గజ్జెల్లి శ్రీను, బానోత్ సంతోష్, పనస శంకర్, కానుగంటి చందు, నండ్రే శ్రీను, వనం కుమార్, చిగురుమామిడి రాజేందర్, గజ్జెల్లి రవి, జయ్యారపు కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

