JUDGE | రాజీమార్గమే.. రాజమార్గం..
JUDGE | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని, రాజీమార్గమే రాజమార్గం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం కాలం, నగదు వృధా చేసుకోకుండా రాజీమార్గం ఎంచుకోవాలని సూచించారు. సమస్యలను సులువైన మార్గంలో పరిష్కరించుకునేందుకు ఇలాంటి లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ కేసుల పరిష్కారంలో ముందుంటుందని అందుకు ఇరువర్గాల వారు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

