nominations | ప్రచారానికి తెర.. ప్రలోబాలకు ఎర..!

nominations | ప్రచారానికి తెర.. ప్రలోబాలకు ఎర..!
- ఎల్లుండి రెండో విడత పోలింగ్
- 3,912 పంచాయతీలకు 18,128 మంది పోటీ
- వినూత్న ప్రచారం.. హామీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్న అభ్యర్థులు
- మద్యం దుకాణాలు బంద్
nominations | తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్ , ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నిన్నటి నుంచి హోరెత్తించిన ప్రచారాలు మూగబోయాయి. ఇప్పటి వరకూ ప్రచారాలతో ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు(Candidates ఎన్నో ప్రయత్నాలు చేశారు. వినూత్న ప్రచారాలు కూడా చేశారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఊపందుకున్న ప్రచారాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇప్పటి నుంచి పోలింగ్ రోజు వరకూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొంత మంది అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేసే అవకాశం లేకపోలేదు.
మద్యం దుకాణాల బంద్..
ఎన్నికల నిబంధన ప్రకారం ప్రచారం ముగిసిన నాటి నుంచి పోలింగ్(polling) పూర్తయ్యే వరకూ మద్యం దుకాణాలు బంద్ చేస్తారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 14 న నాడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాలు విడుదల చేసే వరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై పోలీసులు నిఘా వేయాలని పలువురు కోరుతున్నారు.
3,912 సర్పంచుల బరిలో 13,128 మంది..
రాష్ట్రంలో ఈ నెల 14న జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరుగుతుంది. రెండో విడతలో 4,332 పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ(notification issued) చేసింది. ఇందులో 415 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యారు.
మిగిలిన 3,912 సరంచ్ పదవులకు 18,128 మంది పోటీపడుతున్నారు. అలాగే 38,322 వార్డులకు నోటిపై కాగా, అందులో 107 వార్డులకు నామినేషన్లు(nominations) దాఖలు కాలేదు. 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,311 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ వార్డులకు జరిగే ఎన్నికల్లో 78,158 మంది అభ్య ర్థులు పోటీ పడుతున్నారు.
