Rs.1.70 lakh | అభివృద్ధిని చూసి అభ్యర్థులను గెలిపించండి
Rs.1.70 lakh | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటెయ్యండని నర్సింహులపేట కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెదమాముల యాకయ్యకు కేటాయించిన ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో రూ.1.70 లక్షల(Rs.1.70 lakh) నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేశామని రూ.11 లక్షలతో సైడు డ్రైన్లు కూడా నిర్మించామని, దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా నిధులు మంజూరుతో టెండర్ కూడా అయిందని త్వరలోనే పనులు కూడా జరుగుతాయన్నారు.
75 ఇందిరమ్మ ఇండ్ల(75 Indiramma houses)ను కూడా మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిందని మిగిలిన హామీలను కూడా నెరవేరుస్తుందని అన్నారు. గ్రామ సర్పంచ్ ఎంపిక విషయంలో సమిష్టి నిర్ణయాలతోనే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ఎంపిక జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్(Ponnam Srikanth), వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేముల జైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు అలువాల శ్రీనివాస్, మంచినీళ్ళ రవీందర్ రెడ్డి, యదళ్ళ రవీందర్ రెడ్డి, గౌని యాదగిరి, దోమల యాదగిరి, కాస యాకన్న, బత్తుల రమేష్, నెలకుర్తి మోహన్ రెడ్డి, ఎర్ర రవి, దూరు యాకన్న, దూరు బాబు, తదితరులు పాల్గొన్నారు.

