Administrator | జాతీయ ఛాంపియన్‌షిప్‌కు ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు ఎంపిక…
Administrator | అర్మూర్, ఆంధ్ర ప్రభ : ఆక్స్ఫర్డ్ పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థి మంగళారపు ప్రణవ్ కుమార్, 5వ తరగతి విద్యార్థి పిడుగు శివ, జాతీయ ఛాంపియన్‌షిప్(Championship)కు ఎంపికయ్యారని పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ తెలిపారు. ఈ పోటీలు డిసెంబర్ 18న హైదరాబాద్‌లోని కేఎల్‌ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో లీడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడనున్నాయని ఆయన అన్నారు.
నవంబర్ చివరి వారం రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన ఈ ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి(National Level) పోటీలకు అర్హత సాధించారు. మంగళారపు ప్రణవ్ కుమార్ జాతీయ సైన్స్ ఛాంపియన్‌షిప్‌కు, పిడుగు శివ జాతీయ ఇంగ్లీష్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్, అడ్మినిస్ట్రేటర్ పద్మ, అకాడమిక్ కోఆర్డినేటర్ జ్యోతి, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి, సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ… విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, రాబోయే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమకు,తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు, ప్రతిష్ఠ తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

