Be Alert | తుంగభద్ర నీరు ఆపేస్తారు
- పైప్ లైన్ లీకేజీలు నియంత్రించాలి
- అంతరాయం లేకుండా నీటి సరఫరాకు యత్నం
- కర్నూలు కమిషనర్ పి.విశ్వనాథ్
Be Alert | కర్నూలు, ( కార్పొరేషన్), ఆంధ్రప్రభ : వచ్చే ఏడాది జనవరి 10 తర్వాత తుంగభద్ర నది ద్వారా అందే నీటి పారుదల నిలిపివేయనున్న నేపథ్యంలో నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఇంజనీరింగ్ విభాగం, అమెనిటీస్ విభాగం, తాగునీటి విభాగ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుంగభద్ర నీటి నిలుపేత అనంతరం వేసవి కాలంలో నగరానికి అవసరమైన నీటి సరఫరా నిరాటంకంగా కొనసాగించేందుకు ట్యాంకుల శుభ్రపరిచే పనులు, ప్రత్యామ్నాయ బోర్లు, మోటారుల మరమ్మతులు, పవర్ బోర్ల వినియోగం, ట్యాంకర్ సప్లై వంటి చర్యలను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో లీకేజీలను పూర్తిగా నియంత్రించి, పైపులైన్ మరమ్మతులను రోజువారీగా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఇంచార్జీ ఎస్ఈ శేషసాయి, ఎంఈ మనోహర్ రెడ్డి, ఏఈలు, ట్యాబ్ ఇంస్పెక్టర్లు, ఫిట్టర్లు, తదితరులు పాల్గొన్నారు.


