Ballot | కిర్గుల్ (బి)లో విస్తృత ప్రచారం
Ballot | బాసర, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని కిర్గుల్ బి గ్రామంలో ఆయా పార్టీల నాయకులు బలపర్చిన అభ్యర్థులు ఈరోజు విస్తృత ప్రచారం నిర్వహించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి తినేట్ల సరోజన రామ్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్(MLA Power Rama Rao Patel), ఎంపీ నగేష్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తూ అభివృద్ధి పరుస్తానని హామీ ఇస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ బ్యాలెట్(Ballot) పేపర్లను ఓటర్లకు పంచుతూ ప్రచారం నిర్వహించారు. వీరి వెంట బీజేపీ నాయకులు దశరథ్ మల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

