MPTC | సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి
- అభివృద్ధి చేసి చూపిస్తా..
- లక్ష్మీపూర్ సర్పంచ్ అభ్యర్థి గోవిందుల జలపతి
MPTC | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : సర్పంచ్ గా అవకాశం ఇచ్చి గెలిపిస్తే.. గ్రామాన్ని అభివృద్ధి(Development) దిశలో పయనింపజేస్తానని సర్పంచ్ అభ్యర్థి గోవిందుడు జలపతి అన్నారు. ఈ రోజు ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో ఎంపిటిసి(MPTC)గా చేసిన అనుభవంతో ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. ప్రతి ఇంటికి సేవ చేసేందుకే నేనున్నానని జలపతి పేర్కొన్నారు.

