Nandyala | రేపు వాజపేయి విగ్రహ ప్రతిష్ఠ
- నంద్యాలకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాక
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు బీజేపీ (BJP) జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు శుక్రవారం పేర్కొన్నారు. శనివారం ఉదయం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటుచేస్తున్న విగ్రహ ప్రతిష్ఠకు ప్రతిఒక్కరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి భారీ పరిశ్రమలు శాఖ కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు రానున్నట్లు తెలిపారు.

