Election | హామీలన్నీ నెరవేర్చాలి
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల బైఠాయింపు
Election | విజయనగరం, (ఆంధ్ర ప్రభ): సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ స్థానిక కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. కనీస వేతనం అమలు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్ విధానానికి స్వస్తి చెప్పాలని కోరారు.

