లైఫ్ సైన్సెస్ పాలసీపై త్వరలోనే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. హెచ్‌ఐసీసీ బయో ఏషియా 2025 సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు బీడియాతో మాట్లాడారు.
ఈ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల పట్టాతో బయటకు వచ్చే విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం ఉండటం లేదన్నారు.
ఈ గ్యాప్‌ను ఫిల్ చేయడమే మా లక్ష్యమని చెప్పారు. అందుకే పరిశ్రమల భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఫార్మా రంగంలో తెలంగాణలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.
కాలుష్యం లేకుండా వీటిని టైర్ 2, టైర్ 2 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. వికారాబాద్, జహీరాబాద్‌లో ఇప్పటికే స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు.
లగచర్లలో ఫార్మా పరిశ్రమల కాకుండా పర్యవరణహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. మా ప్రభుత్వం ప్రజలు తెలిపే నిరసన, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని… అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
తెలంగాణలో యూఎస్ దిగ్గజ కంపెని ఆవ్జొన్, మరికొన్ని దిగ్గజ సంస్థలు రూ.5వేల కోట్లు- పెట్టు-బడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు.