Region | ఎస్బీఐ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

Region | ఎస్బీఐ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

  • దేశ స్థాయిలో మచిలీపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్‌కి ప్రథ‌మ స్థానం
  • ఎస్బీఐ విశ్రాంత ఏజీఎం హనుమంతరావు

Region | మచిలీపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : భారత దేశ స్థాయిలో (2025 నవంబర్) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 600 సర్కిల్స్ పరిధిలో నిర్వహించిన సర్కిల్ పనితీరులో మచిలీపట్నం రీజియన్ మొదటి స్థానం పొందిందని ఎస్బీఐ విశ్రాంత ఏజిఎం, ఎల్.ఎస్.ఎస్.వి.డి హనుమంతరావు తెలియజేశారు. గురువారం మచిలీపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ బ్యాంకింగ్ ఆఫీస్ ఏజీఎం సరిపల్లి సుబ్రహ్మణ్యంకు మచిలీపట్నం లేడీ యాంప్తుల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ అన్ని పథకాలలో గుర్తింపు పొంది దేశ స్థాయిలో మచిలీపట్నం సర్కిల్ ప్రథమ స్థానం పొందటం ఎంతో ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. సుబ్రమణ్యం తన పదవికే వన్నె తెచ్చే విధంగా విధి నిర్వహణ చేయటం, అంకితభావంతో అన్ని బ్రాంచీలలో ఉద్యోగస్తుల పనితీరు పెంపొందించడం ప్రధాన కారణమని అన్నారు..

ఈ సందర్భంగా మచిలీపట్నం రీజియన్ ఏజీఎం సుబ్రమణ్యం మాట్లాడుతూ తాను కూడా రాజోలు పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, ప్రభుత్వ స్కాలర్షిప్ ద్వారా డిగ్రీ పూర్తి చేసి ఆదిలాబాద్‌లో మొదలైన తన ఉద్యోగ ప్రస్తావన అంచలంచెలుగా ఎదిగి మచిలీపట్నంలో ఏజీఎం చేసే అవకాశం దక్కిందన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో అన్ని బ్యాంకుల కంటే మెరుగైన సేవలు అందిస్తూ కస్టమర్ల‌ మన్ననలు పొందుతుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కువ మంది విద్యార్థులకు అందించడం జరిగిందని తెలిపారు.

కళాశాల అభివృద్ధి కమిటీ మాజీ సభ్యులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తమ కళాశాలలో గతంలో లక్ష రూపాయలు ఖరీదు చేసే సైకిళ్ళు పేద విద్యార్థులకు అందజేశారని తెలియజేశారు. తమ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకుల అభ్యర్థుల మేరకు కళాశాలలో ఎస్బీఐ ద్వారా 15 కంప్యూటర్లు, సిమెంట్ బెంచీలు, బర్కడేలు అందజేయడంలో ఎస్బీఐ ముందుకు వచ్చినట్లు తెలియజేశారు. మచిలీపట్నం పేరును జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినందుకు మచిలీపట్నం ప్రజలు తరపున ఎస్బిఐ ఎటిఎం సుబ్రమణ్యం కు అభినందనలు తెలియజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ పి.లక్ష్మి ఇతర అధ్యాపకులు విద్యార్థులు కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం ఘనంగా సన్మానించారు.

Leave a Reply