village development | అభివృద్ధి చేసేందుకే ఎన్నికల బరిలో..
- కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రంగరాజ కిషన్
village development | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కల్వకుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఆశీర్వదించి ఓటేస్తే గ్రామాభివృద్ధికి(village development) కృషి చేస్తానని రంగరాజ కిషన్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తనను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పై సంపాదించుకునేందుకు రావడంలేదని, గ్రామాభివృద్ధి చేసేందుకే సర్పంచ్ ఎన్నికల్లో(elections) బరిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు(MLA Mynampally Rohit Rao) సహకారంతో గ్రామానికి అహర్నిశలు పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

