Sarpanch | ఆద‌రించి గెలిపించండి.. అభివృద్ధి చేస్తా..

Sarpanch | ఆద‌రించి గెలిపించండి.. అభివృద్ధి చేస్తా..

  • సర్పంచ్ అభ్యర్థి దండు రాధ దత్తురాం

Sarpanch | మక్తల్, ఆంధ్రప్రభ : కర్నిగ్రామ అభివృద్ధి కోసం ప్రజలందరూ ఆదరించి సర్పంచ్‌గా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని గ్రామ సర్పంచ్ అభ్యర్థి దండు రాధ దత్తురాం అన్నారు. కాంగ్రెస్, బిజెపి మద్దతుతో పోటీ చేస్తున్న ఆమె గురువారం గ్రామంలో తన మద్దతు దారులతో కలిసి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కార‌ణంగా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని విమ‌ర్శించారు. సర్పంచ్‌గా ఆదరిస్తే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

అంతే కాకుండా నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా చూస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మద్దతుతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు చిన్న రంగప్ప, మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్, నాయకులు భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, వాకిటి కిష్టప్ప, భగవంతు రెడ్డి, మైబు, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply