Voters | ములుగు జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్

Voters | ములుగు జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్

  • ఉదయం 9 గంటల వరకు 13.31 శాతం పోలింగ్

Voters | ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లాలో మొదటి విడతలో భాగంగా గోవిందరావు పేట, తాడ్వాయి, ఏటూరు నాగారం మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 9 గంటల వరకు 13.31శాతం పోలింగ్ నమోదైంది.

Leave a Reply