గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 15
15

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి
బ్రహ్మాక్షరసముద్భవమ్‌ |
తస్మాత్‌ సర్వగతం బ్రహ్మ
నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్‌ ||

తాత్పర్యము : నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపడగా, అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై యుండును.

భాష్యము : ఈ భౌతిక ప్రపంచములో నున్న బద్ధజీవులు భోగాభిలాషలో మునిగిఉందురు. అందువలన భగవంతుడు స్వయముగా వేదములను మనకు తెలియజేసేను. వాటి ఉద్దేశ్యము, జీవుడు తన కోర్కెలను తీర్చుకొంటూ శాస్త్రనియమములను పాటించినట్లయితే క్రమేణా పవిత్రీకరణ చెంది, చివరకు భగవద్ధామమును చేరగలుగుతాడు. అయితే ఇలా శాస్త్రనియమములన్నింటినీ మనమున్న పరిస్థితుల దృష్ట్యా పాటించలేక పోయినననూ, వాటి సారంశమైన భగవద్భక్తిని చేసినట్లయితే అదేఫలితాన్ని తప్పక పొందే అవకాశం ఉంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *