Selfless | ఆదరించండి.. అవ‌కాశం ఇవ్వండి… అభివృద్ధి చేసి చూపిస్తా..

Selfless | ఆదరించండి.. అవ‌కాశం ఇవ్వండి… అభివృద్ధి చేసి చూపిస్తా..

Selfless | ఇంద్ర‌వెల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : ఆదిలాబాద్ జిల్లా మండలంలోని ముత్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి(development) చేసి చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి రితే విట్టల్ అన్నారు. పంచాయతీ ప్రజలు ఈసారి ఎన్నికల్లో తన గుర్తు అయిన టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి మెజారిటీతో గెలిపించాలని, తనకున్న పరిచయాలు, నేతలతో ఉన్న అనుబంధం మేరకు గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తానని అన్నారు.

నా అమూల్యమైన ఉద్యోగాన్ని త్యాగం చేసి గ్రామపంచాయతీ కొరకు నిస్వార్థ సేవలు(Selfless services) అందించి ప్రజల సమస్యలపై ఎల్లవేళలలో అందుబాటులో ఉండి గ్రామపంచాయతీకి అనుకోలేని సేవలు అందిస్తానన్నారు.

Leave a Reply