Distribution | ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలి

Distribution | ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలి

  • గ్రామపంచాయతీ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన ఏసీపీ

Distribution | దండేపల్లి, ఆంధ్రప్రభ : మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దండేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేపట్టనున్న డిస్ట్రిబ్యూషన్(Distribution) సెంటర్లను బుధవారం మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

పోలింగ్ సిబ్బందికి సరఫరా అయ్యే బ్యాలెట్ బాక్సులు, సీల్ మెటీరియల్, స్టేషనరీ, సెక్యూరిటీ కవర్ తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.

పోలీసు సిబ్బందికి ఏసీపీ ఆర్ ప్రకాష్ పలు సూచనలందించారు. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్(Receiving) సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా పోలీసులు, రెవెన్యూ శాఖ పరస్పర సమన్వయంతో పనిచేయాలంటూ ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ అందజేతలో, పోలింగ్ కేంద్రాల(Polling Stations)కు చేరడానికి ఏ ప్రాంతానికి ఎంత సమయం పడుతుందో ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద 24గంటల నిఘా, పోలీసు పికెట్(Police Picket), సీసీ కెమెరా పర్యవేక్షణ ఉండాలని, అనుమతి లేని వ్యక్తులను లోనికి రానివ్వకూడదని, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నిష్పాక్షిక, ప్రశాంత వాతావరణంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి పోలీసులు పూర్తిగా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు, అభ్యర్థులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పోలీస్ వారికి సహకరించాలన్నారు. ఏసీపీ వెంట లక్షెటిపేట సిఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసీనుద్దీన్ లు పాల్గొన్నారు.

Leave a Reply