Mallampally | సంతోష్ ను గెలిపించాలి
మాజీ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి
Mallampally | మల్లంపల్లి, ఆంధ్రప్రభ : నిస్వార్థపరుడు, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం చిదర సంతోష్ ఫుట్ బాల్ గుర్తుకు ఓటేసి బారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం సర్పంచ్ అభ్యర్థి చీదర సంతోష్ తో కలిసి వై.సతీష్ రెడ్డి మల్లంపల్లిలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ… రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ప్రజా ప్రభుత్వంపై మండిపడ్డారు..
మంత్రి సీతక్క మల్లంపల్లి సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే.. గ్రామంలో డ్రైనేజీ, రోడ్లు, గుడులు కడతానంటూ హామీలు ఇవ్వడం విడ్డూరమన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామాన్ని పట్టించుకోలేని వారు నేడు సర్పంచిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చీధర సంతోష్ గ్రామ సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్నాడని, అతడిని గెలిపిస్తే అన్ని విషయాలలో అభివృద్ధి పరుస్తాడన్నారు. మల్లంపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉండి మల్లంపల్లిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాడని తెలిపారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్, మాజీ సర్పంచ్ చందర్ కుమారస్వామి, రాష్ట్ర నాయకులు బత్తోజు ద్రోణాచారి, మాజీ ఎంపిటిసి మాచర్ల ప్రభాకర్, యువజన నాయకులు మొర్రి రాజు యాదవ్, మహమ్మద్ చోటు, జిల్లా యూత్ అధికార ప్రతినిధి రేణికుంట్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు.

