Constitutional | కడియం వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి…

Constitutional | కడియం వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి…

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

Constitutional | ఆంధ్రప్రభ, జనగామ : స్టేషన్ ఘ‌న్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి సీపీఎం పార్టీపై ప్రచారంలో చేసిన‌ అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకొని సీపీఎం పార్టీకి క్షమాపణ చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) అన్నారు. ఈ రోజు జనగాం జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గ్రామ పంచాయతీల ఎన్నికల్లో సిపిఎం పార్టీ గ్రామ అభివృద్ధి(Village Development) కోసం పని చేసే అభ్యర్థులకు సీపీఎం పార్టీ కార్యకర్తలు తోడ్పాటు అందిస్తారన్నారు.

అదేవిధంగా నిన్న లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామంలో సీపీఎం కార్యదర్శి బొడ్డు కర్ణాకర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారనే నెపంతో టీఆర్ఎస్ గుండాలు వారి ఇంటిపైకి వచ్చి అసభ్య పదజాలంతో దూషించడం జరిగిందన్నారు.

ఈ విషయంపై కరుణాకర్ భార్య మనస్థాపానికి గురై ఆత్మహత్యాయ‌త్నానికి పాల్పడింది.. ఈ విషయంపై స్థానిక ఎస్సై కి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా, వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నా కలెక్టర్, పోలీస్ శాఖ(Police Department) చర్యలు తీసుకోకపోవడం శోచనీయంగా ఉందన్నారు.

అదేవిధంగా కడియం శ్రీహరి సీపీఎం పార్టీపై ద్వంద వైఖరి అవలంబిస్తూ.. స్థానిక ఎన్నికల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కడియంది పూట పూట‌కు మాట మార్చే నైజమ‌ని, సీపీఎం పార్టీ పేదల ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందన్నారు.

దేశంలో రాజ్యాంగ(Constitutional) పరిరక్షణకై లౌకికవాద శక్తులు ఏకమైంది విధితమే కానీ.. ఈ స్థానిక ఎన్నికల్లో గ్రామ అభివృద్ధి, నీతి నిజాయితీగా ప్రజల సమస్యలను పరిష్కరించే అభ్యర్థులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోపు కనకా రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, బూడిది గోపి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply