Revanth Reddy | హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా చేస్తే..

Revanth Reddy | హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా చేస్తే..
Revanth Reddy, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రపంచం అంతా తెలంగాణ వైపు చూసేలా తన వంతు కృషి చేస్తానని.. మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ముగింపు వేడుకల్లో చిరంజీవి మాట్లాడారు. ఈ ఈవెంట్ కు తనని ఆహ్వానించడం.. గౌరవంగా భావిస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్ర పరిశ్రమ(film industry) పై ఎంతో గౌరవం ఉంది. హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా చేస్తే బాగుంటుందన్న నా ఆలోచనను సీఎంతో రెండేళ్ళ క్రితం పంచుకున్నాను.. హైదరాబాద్ ను సినిమా హబ్ గా చేయడంలో మేమంతా ముందుంటాం. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి వాళ్లు ఇక్కడ స్టూడియోలు(studios) నిర్మించేందుకు ముందుకు రావడం శుభారంభం. దీనిని స్పూర్తిగా తీసుకుంటాం అన్నారు.
రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం(The government is ready)గా ఉందని సీఎం స్పష్టం చేసారు. ప్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని.. 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. స్క్రిప్ట్(script) తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, అక్కినేని అమల, జెనీలియా పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.


