చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండలంలోని అమృతండా గ్రామంలో సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన బోడ వీరాసింగ్ ఎన్నికయ్యారు. గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అభ్యర్థులు వివిధ పార్టీల తరఫున దరిచేరగా, గ్రామస్తులు, గ్రామ పెద్దల సమక్షంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులకూ ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. అందువలన పంచాయతీ మొత్తం ఏకగ్రీవంగా ఏర్పడింది. ఇరు పార్టీల ఒప్పందం ప్రకారం, సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ నుండి బోడ వీరాసింగ్, ఉప సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ నుండి బోడ సంపత్ ఎన్నికయ్యారని గ్రామస్తులు తెలిపారు.
అమృతండా గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం..

