ఆశీర్వదిస్తే మేదరిపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…

  • కాంగ్రెస్ అభ్యర్థి చొప్పదండి వనిత రాజేష్…

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఈ నెల 11న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపిస్తే, మెదరిపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చొప్పదండి వనిత రాజేష్ అన్నారు.

మంగళవారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన వనిత రాజేష్, మెదరిపేట గ్రామంలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలబడి, ప్రజల కష్టాలకు పరిష్కారం చూపేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు.

ఇప్పటికే గ్రామంలో తాము చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకోవాలని, ఒక్కసారి ఆలోచించి అవకాశమివ్వాలని ఓటర్లను కోరారు. గ్రామంలోని అన్ని వీధుల్లో వీధిలైట్లు ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం వంటి కీలక పనులను చేపట్టే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీలతో గెలిపించాలని వనిత రాజేష్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply