Vande Bharat | రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
Vande Bharat | గుడివాడ, ఆంధ్రప్రభ : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. చెన్నై- విజయవాడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (Train) సేవలను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు ఈ నెల 15వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. అయితే.. నర్సాపురం, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ రైలు నడపాలని ప్రయాణికుల కోరుతున్నారు.

