Election | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉదయం 7 గంటలకు ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని పలు వార్డుల(Many wards)లో పర్యటించిన జిల్లా కలెక్టర్ నేరుగా గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఓటర్ స్లిప్ పంపిణీ పై గ్రామ కార్యదర్శి సందీప్ ను, ఎలెక్ట్రీషన్ ఉప్పు జయరాజ్ ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్(Voter slip for every household) లను అందించాలని, ఎన్నికల తేదీ, పోలింగ్ సమయం పై ఓటర్లలో ఖచ్చితంగా అవగాహన కల్పించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఎలాంటి వారి పై అయినా కఠిన చర్యలు (Strict measures) తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామంలోని పలు ఇళ్లలోకి వెళ్లి గ్రామ ప్రజలను ఎన్నికల సమయం, పోలింగ్ తేదీని అడిగి తెలుసుకున్నారు.
Election | కలెక్టర్ ఆకస్మిక పర్యటన

