Sangareddy | ఉద్యమ నాయకులను గుర్తించని బీఆర్ఎస్

Sangareddy | ఉద్యమ నాయకులను గుర్తించని బీఆర్ఎస్


పది సంవత్సరాల పాలనలో మేం కానరాలే..
నేటికి గుర్తించని బీఆర్ఎస్ నాకు వద్దు
తెలంగాణ ఉద్యమనాయకుడు మల్లేష్ గౌడ్


Sangareddy | గుమ్మడిదల, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొత్తపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ సమయంలో తమ ప్రాణాలను ఫ‌ణంగా పెట్టి ఎన్నో కేసులను ఎదుర్కొని జైలు పాలై తమ జీవితాలను ఆగం చేసుకున్నామని, అలాంటి త‌మకు తెలంగాణ వచ్చిన తరువాత తమ బతుకులు మారుతాయని అనుకున్న తమ జీవితాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంద‌ని తెలంగాణ ఉద్యమ నాయకుడు మల్లేశం భావోద్వేగానికి లోనయ్యారు. ప‌దేళ్ల‌లో తమని పట్టించుకున్న నాధేడే లేడని, నేడు ప్రతిపక్షంలో ఉన్నా తమని గుర్తించలేదని, ఆలాంటి పార్టీలో పొసగడం తమ ఆత్మ విశ్వాసాన్ని చంపుకోవడమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మడిదల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్ట నర్సింగరావు, జిన్నారం మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply