Ambedkar | మహానీయుడు స్ఫూర్తితో..
Ambedkar, గుడివాడ, ఆంధ్రప్రభ : భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు శనివారం గుడివాడ (Gudivada) పట్టణంలో జరిగాయి. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాల్లో గుడివాడ, పామర్రు, పెడన ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పూలమాలలతో నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ.. మరణించి 69 ఏళ్లు గడిచిన ప్రజలందరి దేవుడైన అంబేద్కర్ ప్రతి ఒక్కరు మనసుల్లో చెరగని ముద్ర వేసారన్నారు. నాలాంటివారు రాజ్యాంగ పదవుల్లో గౌరవంగా నిలుచున్నా, కోట్లాదిమంది ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నా.. అది మహానీయుడు అంబేద్కర్ పెట్టిన బిక్ష అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో విభిన్న కులాలు, మతాలు అందరం కలసి మెలసి ఉన్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమే అన్నారు. అందరం కలసి మెలసి ఉంటూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం అన్నారు.
వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. యావత్ భారతదేశాన్ని కలిపి ఉంచే పేరు అంబేద్కర్ అని అన్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప పెద్ద రాజ్యాంగాన్ని రచించి ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహానీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ (TDP) అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, కంచర్ల సుధాకర్, చేకూరు జగన్మోహన్రావు, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, పండ్రాజు సాంబయ్య, కనకాంబరం, వసంతవాడ దుర్గారావు, సయ్యద్ జబీన్, గడ్డం ప్రకాష్ దాస్, వడ్డాది నాగరాజు, కుంచనపల్లి సుబ్రహ్మణ్యం, దాసు శ్యాం కుమార్, సింగాల రాధాకృష్ణ, డేవిడ్, భవాని, మెరుగు మోజెస్, దేవరపల్లి కోటి, నేరుసు కాశి, మహమ్మద్ రఫీ, లోయ విజయ్, మహేష్, వేశపోగు ఇమ్మానుయేలు, జనసేన నాయకులు కోన కేశవ్, కొదమల గంగాధర్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ అథారిటీ కమిటీ సభ్యులు రామిదేని వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.



