Honor | మర్యాదపూర్వకంగా..
- టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావుకు సత్కారం
- పుష్పగుచ్ఛం అందజేసిన అవనిగడ్డ రాజశేఖర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు
Honor | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ రాజశేఖర స్వామి వారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు, చైర్మన్ శుక్రవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు (Kanaparthi Srinivasa Rao) ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నూతన పాలక మండలి సభ్యులు, చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుమ్మల చౌదరి బాబు, గొర్రెపాటి రామకృష్ణ(Gorrepati Ramakrishna), వేమూరి సాయి, పరిసే చలపతి, బండే రాఘవ, మేడికొండ విజయ్, ముళ్లపూడి శ్రీనివాసరావు, కొండవీటి గోవిందు ఆర్యవైశ్య ప్రముఖులు అద్దేపల్లి నాంచారయ్య, విస్సంశెట్టి శేషు, నంబూరి సుబ్రహ్మణ్యం, ఘంటసాల ప్రసాద్(Ghantasala Prasad), వేముల భాను, కూర్చేటి సురేంద్ర రాజశేఖర స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ ఘంటసాల రామమోహనరావు సభ్యులు అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, అవనిగడ్డ రమేష్, వెంతురుమిల్లి వెంకటేశ్వరరావు(Venkateswara Rao) తదితరులు పాల్గొన్నారు.

