AP | పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రభ : ప్రముఖ పరకామణి కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాసులకు తగిన భద్రతను అందించాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. సీఐడీ దర్యాప్తు కోరుతూ… శ్రీనివాసులు దాఖలు చేసిన పిటిషన్‌పై జరిగిన విచారణలో దర్యాప్తు పూర్తి అయ్యేంత వరకు పిటిషనర్‌కు భద్రత కొనసాగించాలని తిరుపతి జిల్లా ఎస్‌పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
