BELLAMPALLI |బెల్లంపల్లిలో గంజాయి కలకలం

1030 గ్రాముల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ కే. శ్రీనివాస్

BELLAMPALLI |బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి (Bellampalli) వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను శుక్రవారం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1,030 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ వివరాలను బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ కే. శ్రీనివాస్ (Inspecter Sreenivas)మీడియాకు వెల్లడించారు. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై సీహెచ్. కిరణ్ కుమార్, కానిస్టేబుల్ ఆర్. సాయి కిరణ్ పెట్రోలింగ్‌లో భాగంగా వాహన తనిఖీ నిర్వహిస్తుండగా.. రెడ్ కలర్ పల్సర్ బైక్‌పై అనుమానాస్పదంగా వచ్చిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వద్ద సుమారు 1,030 గ్రాముల గంజాయి పట్టుబడిందన్నారు.

ఈ ఘటన వన్ టౌన్ పట్టణ పరిధిలోకి రావడంతో ఎస్సై కిరణ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, ఇద్దరు యువకులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు. కాగా పట్టుబడిన వారిలో బెల్లంపల్లి బస్తీకి చెందిన ఎస్.కే.ఖలీమ్,(NK Khaleem) షంషీర్ నగర్‌కు చెందిన పెట్టం రాజేష్ (Pettam Rajesh) ఉన్నారు. ఎస్.కే. ఖలీమ్ కు గంజాయి విక్రయ కేసులో ఇది రెండవసారి పట్టుబడటం గమనార్హం.

వీరు మహారాష్ట్రలోని బల్లార్షా ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా గంజాయి సరఫరా చేసేవారి వివరాలు, సేవించేవారి వివరాలు లేదా ఇతర సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, వారికి తగిన బహుమతి కూడా ఇవ్వబడుతుందని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

Leave a Reply