ENVIROMENT | బిక్కనూర్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అహ్మద్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హనీఫ్ పాషా చెప్పారు. కాలుష్య నియంత్ర మండలి ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను శుక్రవారం కళాశాల ఆవరణంలో విద్యార్థుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాలుష్యం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన సూచించారు. పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ENVIROMENT | పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

