Handloom Workers | సమస్యలు పరిష్కరించాలి

Handloom Workers | సమస్యలు పరిష్కరించాలి
Handloom Workers | గట్టుప్పల, ఆంధ్రప్రభ : తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కమిషనర్ కార్యాలయం ముందు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి మండల కేంద్రానికి చెందిన చేనేతలు గురువారం బయలుదేరారు. రాష్ట్ర చేనేత కార్మిక సంఘం సభ్యుడు కర్నాటి వెంకటేశం (Karnati Venkatesham) మాట్లాడుతూ… రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేనేతను చిన్న చూపు చూస్తుందని, చేనేత కార్మికుల (Handloom Workers) సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, చేనేత రుణమాఫీ కాగితాలకి పరిమితమైందని ఎద్దేవా చేశారు.
కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని (Fulfill promises) డిమాండ్ చేశారు. ధర్నాకు బయలుదేరిన వారిలో మండల కార్మిక సంఘం అధ్యక్షులు గంజి కృష్ణయ్య, కర్నాటి వెంకటేశం, సురపల్లి సత్తయ్య, మండల కిరణ్, పున్న రాఘవేంద్ర, కుకుడాల స్వామి, ఏలే శివశంకర్, సుర వెంకటేశం, సూరెపల్లి మాణిక్యం, సంగెపు శ్రీహరి, సురేష్, గంజి రాములు, తిరందాస్ అశోక్, నామని గణేష్, పులిపాటి ఆంజనేయులు, కోడి సురేష్, చెరుపల్లి వెంకటేశం, మెట్టు లక్ష్మణ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
