crime | వృద్ధురాలు అనుమానస్పద మృతి

crime | వృద్ధురాలు అనుమానస్పద మృతి

crime | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : గుర్తు తెలియని వ్యక్తుల చేత అనుమానస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఈ రోజు నెల్లికుదురు మండలంలోని రామన్నగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై చిర్ర రమేష్ బాబు(Chirra Ramesh Babu) తెలిపిన వివరాల ప్రకారం కళ్లెపు పద్మ(62), భర్త సీతయ్య గౌడ వృద్ధురాలు గ్రామం తిర్లాపురం, కురవి మండలానికి చెందిన మృతురాలు కల్లెపు పద్మ రామన్నగూడెం గ్రామానికి చెందిన తన కూతురు కొయ్యాడి సరిత ఇంటిలో నివాసం ఉండేదన్నారు.

కూతురు సరిత(daughter Saritha) బతుకు దెరువు రీత్యా హైదరాబాద్‌కు వెల్లి ఉండగా మృతురాలు పద్మ ఒక్కరే ఇంటి వద్ద ఉండేదన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉద‌యం ముగ్గు పెట్టకుండా ఉండడంతో పొరుగింటి సుర సుగుణమ్మ ఇంటికి వెళ్లి చూడగా మృతురాలు పద్మ రక్తపు గాయాలతో చనిపోయి ఉన్నట్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న కూతురు సరిత హైదరాబాద్ నుండి వచ్చి చూసే వరకు కాళ్లకు, మెడకు రక్త గాయాలై చనిపోయి ఉన్నట్లు తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని కూతురు సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply