BC | రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే బీసీలకు అన్యాయం..

BC | రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే బీసీలకు అన్యాయం..
BC, హైదరాబాద్, ఆంధ్రపభ : కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఓటు బ్యాంకుగా ఉపయోగింఛుకున్నారని అనంతరం పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్న దోరణి బీసీలను మోసం చేయడమే అవుతోందని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రాష్ట్ర ప్రభుత్వ తీరు పై ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో న్యాయపరమైన అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫ లమైందన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఇతర పార్టీల పై మోపడానికి ప్రయత్నించడం సరైంది కాదన్నారు. రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణల ప్రకారం, స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఉండి సమావేశాలు నిర్వహిస్తేనే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసి 21 నెలలు దాటినా, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయితీలకు దాదాపు రూ 4 వేల కోట్ల నిధులు నిలిచిపోయినట్టు తెలిపారు. ఎన్నికలు జరిపి పాలకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడే ఆ నిధులు విడుదల అవుతాయన్నారు. కనీసం ఇప్పుడైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
https://epaper.prabhanews.com
