HYD | అయ్యప్ప పూజలో ఎమ్మెల్యే గణేష్..

కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బొల్లారం నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో సాయి అన్నదాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే గణేష్ ప్రార్థించారు. ఈ పడి పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కదిర్వన్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
