Bihar | మహాఘట్‌బంధన్ ఎందుకు విఫలమైంది…

Bihar | మహాఘట్‌బంధన్ ఎందుకు విఫలమైంది…
బీహార్ అసెంబ్లి ఎన్నికల్లో మహాఘట్‌బంధన్… ప్రధానంగా ఆర్‌జేడీ నాయకుడు తేజస్వీ ఎందుకు విఫల మయ్యారు. ఆయన వ్యూహం పూర్తిగా దెబ్బతింది. పులిని, లేడిని ఒకే కొలనులో పక్కపక్కనే ఒకేసారి నీరు తాగించాలని ఆయన అనుకున్నారు. ఆయన అత్యాశకుపోయారు.
యాదవ్ సామాజిక వర్గం గాండ్రింపులకు ఇతర వర్గాలవారు వణికిపోయారు. వారిని పాతభయాలు వెంటాడాయి. ఆయన తల్లితండ్రుల హయాంనాటి జంగిల్‌రాజ్ గుర్తుకు వచ్చింది. తేజస్వి చేసిన వాగ్దానాలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీశాయి. రామరాజ్యంలో పులి, లేడి ఒకే సారి చెరువులో నీరు తాగడం అనేది అసాధ్యమని రుజువైంది.
మరో వంక బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఆర్‌జేడీపై అదే పనిగా దాడి చేసింది. తేజస్వీ తండ్రి, ఆర్‌జేడీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సామాజిక న్యాయం కోసంఎంతో కాలంగా పోరాడుతున్నారు. ఈ ఎన్నికల్లో అగ్రవర్ణాలు ప్రాబల్యాన్ని పెంచుకుని సామాజిక న్యాయాన్ని కూకటివేళ్ళతో పెల్లగించాయి.
పదిహేనేళ్ళ క్రితం ఆయన స్థాపించిన పార్టీ ప్రముఖమైనదిగా రూపుదిద్దుకుంది. మంచి పలుకుబడి కలిగిన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. వారికి సంఖ్యాపరంగా బాగా బలం ఉంది. పదిహేనేళ్ళ పాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన లాలూ కుటుంబం ఎంత చెబితే అంత అనే తీరులో అధికారాన్ని చెలాయించింది.
లాలూ వర్గానికి అంగ బలం, అర్థ బలం ఉంది. లాలూ సొంత సామాజిక వర్గం యాదవ్‌లు కాగా.. ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్ కుమార్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వరకూ తేజస్వీ అధికారంలోకి వస్తే తిరిగి జంగిల్‌రాజ్ తప్పదని ప్రజలను ప్రచారం ప్రారంభం నుంచి హెచ్చరిస్తూ వచ్చారు. బీహార్‌లో నేరస్థులు చెలరేగిపోతారని, నేరస్థుల ముఠాలు మళ్ళీ పుంజుకుంటాయని హెచ్చరిస్తూ వచ్చారు.
30 ఏళ్ళు పైబడిన యువతరానికి ఆనాటి పాలన ఎలా ఉండేదో తెలియదు. నితీశ్ పాలనలో నేరస్థుల ముఠాలు అదుపులో ఉన్నాయి. మరో వంక పాలనాయంత్రాంగంలో కూడా మార్పులు వచ్చాయి. పాలనాయంత్రాంగంలో ఉన్న వారికి ఈ ముఠాలను ఎలా ఎదుర్కోవాలో తెలియదు.
మహిళలు, యువకుల ఐక్య సంఘటనతో ఆర్‌జేడీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది. తేజస్వీ అం దుకు అతీతంగా ఈసారి ప్రచారం చేశారు. యాదవేతర ఓబీసీ వర్గాల్లో యువ తరాన్ని ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నించారు. బీజేపీ, జేడీయుూ కూటమి అనుకూల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. యాదవేతర ఓబీసీలు తమ సత్తా చూపిం చారు. బీహార్ జనాభాలో ఒబీసీలు 27 శాతం ఉన్నారు.
వారిలో యాదవులు 4.26 శాతం ఉన్నారు. 2022నాటి కులగణనని వేదిక ప్రకారం ఒబీసీల్లో యాదవులే పెద్ద సామాజిక వర్గం. 80వ, 90వ దశకాల లో యాదవుల ప్రత్యర్థులు భూమిహార్ లు, రాజ్‌పుట్‌లు, బ్రాహ్మణులు, యాదవేతరులు ఉండేవారు. ఇప్పుడు వారు బాగా పుంజుకున్నారు.
అప్పటి వరకూ అణ గారిన వర్గాలుగా ఉన్న యాదవులు నియో భూస్వాములుగా తయారయ్యారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఆర్థికంగా బాగా వెనుకబడిన వర్గాలను (ఈబీసీ) తన ఓటు బ్యాంకుగా మలుచుకున్నారు. లాలూని గద్దె దింపేందుకు ఈ వర్గం ఉప యోగపడుతుందన్నది ఆయన ఎత్తుగడ. యాదవులు, ఈబీసీలు రెండు వేర్వేరు వర్గాలు తయారయ్యాయి. ఒకరి కొకరు మిత్రులు మాత్రంగా కాదు. చేతిలో లాఠీలు ఉండే వర్గంగా యాదవులు… లాలూ గ్రూపుగా అభివర్ణితుల య్యారు. ఆ పేరు అలా స్థిరపడిపోయింది.
జంగిల్‌రాజ్ భయం..
చేతిలో లాఠీలు కలిగి ఉండటాన్ని యాదవులు గర్వంగా భావిస్తారు. అందరికీ సామాజిక న్యాయం తెస్తామని వారు వాగ్దానం చేస్తూ వచ్చారు.1990లలో పాట్నా గాంధీ మైదా నంలో లాలూ బీహారీ ఆహార్యం (తలపాగ)తో ప్రసంగించి నప్పుడు దానిని వినడానికి ఇసుక వేస్తే రాలనంతగా జనం వచ్చేవారు.
తేజస్వీ తన తండ్రిని పోలిన రీతిలో ఆర్‌జేడీ సంప్ర దాయాన్ని నిలబెట్టే రీతిలో ప్రయత్నించడమే కాదు, జంగిల్ రాజ్ జ్ఞాపకాలను ప్రజలకు గుర్తు చేశారు. అయితే, 20 శాతం బీహారీ ఓటర్లు 2000 తర్వాత పుట్టిన వారు కనుక వారికి ఆ చీకటి రోజులు గుర్తుండవని ఆయన అనుకున్నా రు. ఆయన నిరుద్యోగులను ఆకర్షించేందుకు ప్రయత్నించారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఆనాటి జ్ఞాప కాలు చెరిగి పోలేదు. జింకలు, లేళ్ళకు పుట్టి నప్పటి నుంచి పులుల భయం ఉంటుంది. పులులు దాడి చేస్తాయన్న భయం వాటిల్లో తొలగిపోదు. ఆర్‌జేడీ ర్యాలీలకు హాజరయ్యే వారిలో అత్యధి కులు బీహారీ తలపాగలతో, లాఠీలు ధరించి ఉండేవారు.
వారి ర్యాలీ లకు వారి సామాజిక వర్గానికి చెందినవారు, ముస్లింలు ఉండేవారు. ఎ న్‌డీఏ నాయకులు తాము చెప్పింది నిజమమతుందని ఓటర్ల లో భయాన్ని సృష్టించేవారు. ఆర్‌జేడీ అధి కారంలోకి వస్తే జంగిల్ రాజ్ అనివార్య మంటూ వారు వాట్ అప్ మెసేజ్‌లలో ప్రజ లను హెచ్చరించేవారు.
యాదవుల ప్రాబ ల్యం పెరిగితే భయానక పరిస్థితులు తప్పవని అప్రమత్తం చేసే వారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో భయాన్ని అధికం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్, ఎన్‌డీఏ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించాయి.యాదవులు అధికారంలోకి వస్తే ఛాతిపై తుపాకీ పెట్టి పరిపాలన సాగిస్తారంటూ హెచ్చరించే వారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీహార్‌లోని భాబువాలో ప్రసంగిస్తూ ఆర్‌జేడీ అధికారంలోకి వస్తే హింస పెరిగిపో తుందని ఓటర్లను హెచ్చరించారు. మీకు సుపరిపాలన కావాలా? తుపాకీ గుళ్ళు కావాలా అంటూ ఓటర్లను ఉద్దేశించి ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో ఆర్‌జేడీ దూకుడు పాలనను గురించి జనానికి గుర్తుచేస్తూ ప్రచారం సాగిం చారు. ఆర్‌జేడీ అధికారంలోకి వస్తే జంగిల్ రాజ్ తప్పదని హెచ్చరించారు.
తేజస్వీ సభకు లక్ష మంది యాదవులు చేతుల్లో లాఠీలు ధరించి హాజరయ్యారు. వీటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఎన్‌డీఏ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు చూపించారు. కోయిల ముందే కూసినట్టు తేజస్వీ ముందే గాండ్రించి నట్టు చేసిన ప్రసంగాలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్య కర్తలు పుట్టించిన భయాన్నిమరింత పెంచాయి. ఒకే కొలనులో లేళ్ళు, పులి నీరు తాగేట్టు చేయగలమన్న తేజస్వి కలను భగ్నం చేశాయి.
