Narsinghi | బీజేపీ సంబరాలు

Narsinghi | బీజేపీ సంబరాలు

Narsinghi | నార్సింగి, ఆంధ్రప్రభ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వం ఘనవిజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోనూ బీజేపీ (BJP) శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఎస్బిఐ ప్రధాన రహదారి వద్ద భారీగా టపాకాయలు పేల్చి విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ నార్సింగి (Narsinghi) మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయకత్వం వహించగా, మెదక్ జిల్లా (బMedak District) మాజీ ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యన్నం లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్, పట్టణ శాఖ అధ్యక్షుడు మైలారం నరసింహులు, యువ మోర్చా మండల అధ్యక్షుడు అశోక్, గురుపాదం, నరేష్, యాదగిరి, స్వామి, హరిబాబు, మల్లికార్జున్, ప్రసాద్, సత్యం, మహేష్, అశోక్, నితిన్, తలుషా, మహేందర్, బాబా గౌడ్, స్వామి గౌడ్, రాజశేఖర్, సుధాకర్, తదితర నాయకులు హాజరై ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply