ICC Champions Trophy | బంగ్లాదేశ్ రెండు వికెట్లు డౌన్.. షమీ, హర్షీత్ రాణాకు వికెట్లు..
దుబాయ్ : ఛాపింయన్స్ ట్రోఫీలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది. అయితే బంగ్లాదేశ్ జట్టు తొలి ఓవర్ లోనే తొలి వికెట్ కోల్పోయింది. భారత్ బౌలర్ మహమ్మద్ షమీ బౌలింగ్ లో ఓవర్ చివరి బంతిలో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ సౌమ్య సర్కార్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అలాగే రెండో ఓవర్ హర్షీత్ రాణా బౌలింగ్ వేయగా.. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ హోషియన్ శాంటో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.