CPI | శతజయంతి..
CPI క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : సీపీఐ పార్టీ (CPI) శతజయంతి ముగింపు సభను డిసెంబర్ 26న ఖమ్మంలో జయప్రదం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. శతజయంతి సందర్బంగా ఈనెల 15 నుంచి కొమరం భీం జిల్లా జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు చేపట్టనున్న బస్సు జాత కరపత్రాలను రామకృష్ణాపూర్ యూనియన్ కార్యాలయంలో విడుదల చేశారు. జోడేఘాట్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు ను సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా ప్రారంభించనున్నారు. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో ప్రయాణం కొనసాగనుంది.
రాష్ట్ర నాయకులు తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావు, కలవేల శంకర్, దళిత కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే. మణికంఠ రెడ్డి, ప్రజానాట్యమండలి కళాకారులు బస్సు జాతలో పాల్గొననున్నారు. పార్టీ బడుగు, బలహీన వర్గాల కోసం సాగించిన సమరయాత్రలు సీపీఐ చరిత్రను సజీవంగా నిలబెట్టాయని నాయకులు పేర్కొన్నారు. ఖమ్మం శతజయంతి సమావేశానికి 40 దేశాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల పార్టీ ప్రజాసంఘాల శ్రేణులు హాజరుకానున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలని ప్రజలకు కోరారు.

