Adilabad | ఉద్యోగుల నిరసన..

Adilabad | ఉద్యోగుల నిరసన..

Adilabad | జైనూర్, ఆంధ్రప్రభ : సమగ్ర శిక్ష ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం ( ఎంఆర్సి) ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో పాఠ్యపుస్తకాలు మోసుకొస్తున్న ఆటో బోల్తా పడి విద్యార్థులు గాయపడిన ఘటనలో బాధ్యులుగా చూపిస్తూ, సమగ్ర శిక్ష ఉద్యోగులైన ఎంఐఎస్ కోఆర్డినేటర్ జి. స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివలింగం, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ డి. రాములు యాదవ్ లను టర్మినేట్ చేయాలన్న ఉత్తర్వులు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్(State Project Director) జారీ చేయడం చాలా బాధాకరం, అన్యాయం అని అన్నారు.

గత దశాబ్ద కాలంగా సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు తక్కువ వేతనాలతోనూ, విధుల్లో నిబద్ధతతోనూ వ్యవహరిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని. ఇటువంటి అనూహ్య ఘటనను కారణంగా చూపి, టెర్మినేషన్ అన్యాయం మని అన్నారు. నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు తుకారం, రవీందర్ గంగు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply