రైతు వినూత్న ఆలోచన
Idear | మంథని: మనసుంటే మార్గం ఉంటుందని ఓ యువ రైతు నిరూపించాడు. మంథని పట్టణానికి చెందిన రైతు తను ఆరుగాలం పండించిన పంట, వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసి దానిని చదును చేసేందుకు ట్రాక్టర్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు. చదునులో ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆ యంత్రానికి బస్తా సంచులు కట్టాడు. యువరైతు ఆలోచనకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

