MLA Palla | ప్రభుత్వంతో పోరాడతా..

MLA Palla | ప్రభుత్వంతో పోరాడతా..

MLA Palla | జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి – ప్రజా సమస్యల పై.. ప్రజల నాణ్యమైన డిమాండ్ పై.. ముందుండి ప్రభుత్వంతో పోరాడతానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeswarreddy) అన్నారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఇటీవలే అక్రమంగా అరెస్ట్ చేయబడిన గనుగుపహాడ్–చిటకొడుడురూ బ్రిడ్జ్ సాధన సమితి కర్ణాకర్ ఉమాపతి పలువురు సభ్యులను జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి చొరవతో బెయిల్ రావడం జరిగింది. వారు చేసిన న్యాయపోరాటాన్ని అభినందిస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల న్యాయమైన డిమాండ్‌ల కోసం శాంతియుతంగా పోరాడే ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గనుగుపహాడ్–చితకొడుడురూ ప్రాంత ప్రజల సమస్య పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరుతూ తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ (TRS) కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply