Armour డ్రంక్ అండ్ డ్రైవ్… భారీ జరిమాన…
అర్మూర్, ఆంధ్రప్రభ : ఆర్మూర్(Armour) పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీ(Vehicle Inspection)లో అతిగా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ముగ్గురు వాహన చోదకులకు అర్మూర్ కోర్టు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్ ఒక్కొక్కరికి పది వేల చొప్పున జరిమానా విధించారని అర్మూర్ ఎస్ఎచ్ఓ పి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
అర్మూర్ మున్సిపల్ పరిధిలో ఈ రోజు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్(Special drive)లో మద్యం తాగి వాహనం నడిపిన అర్మూర్ పట్టణానికి చెందిన జక్కం భూమేష్, ఉమ్మేడ గ్రామానికి చెందిన ముత్తన్న, మైలారం గ్రామానికి చెందిన ఊరుసు శ్రీనివాస్ లు పట్టుబడగా ఒకొక్కరికి 10 వేల చొప్పున సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్(Second Class Magistrate) జరిమానా విధించారని సీఐ తెలిపారు.
మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులకు మోటార్ వెహికల్(Motor Vehicle) నూతన చట్టం 2019 ప్రకారం భారీగా జరిమానాలు, జైలు శిక్షలు కూడా పెంచిందని పేర్కొన్నారు.

