Motkur : ఆర్థిక సాయం అందజేత…
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు(Motkur) మండలం సదర్ షాపూర్(Sadar Shahpur) గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన మాజీ వార్డ్ మెంబర్ గంగాపురం సోమక్క కుటుంబానికి వీఆర్ (కీ.శే.వర్రే రాఘవులు)ఫౌండేషన్(Foundation) ఆధ్వర్యంలో నిర్వాహకులు వర్రే హరిప్రసాద్ రూ. 5000 ఆర్థిక సాయం స్వయంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు సుంకరి సోమయ్య, లగ్గాని యాదయ్య, దొండ సోమన్న, దొండ భిక్షమయ్య, బత్తిని నరసింహ, గొట్టే యాదయ్య, తీగల చంద్రయ్య, ఉయ్యాల అంజయ్య, కుంచం వెంకన్న, బెజగం యాదగిరిలు పాల్గొన్నారు.

