జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగురుతుంది… సునీత అసెంబ్లీకి వెళతారు…

కేటీఆర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం.. మాగంటి సునీత(Maganti Sunitha) అసెంబ్లీకి వెళ్లడం ఖాయం.. ఇదీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు(K. Taraka Rama Rao) (కేటీఆర్) ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
అట్టర్ ప్లాప్ గవర్నమెంట్ ఒక వైపు… పదకొండేళ్లుగా రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ మరో వైపు… జూబ్లీహిల్స్ పోటీలో(Jubilee Hills in the competition) ఉన్నాయి. గత మా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ 16,000 మెజార్టీతో గెలిచారు.. ఇప్పుడు మెరుగైన మెజార్టీతో వస్తుంది.. కేసీఆర్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలన చూసిన ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారు.
