భారతీయుల్లో స్ఫూర్తి నింపే వందేమాతరం..
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కలెక్టరేట్లో సామూహిక వందేమాతర గీతాలాపన
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Koya SriHarsha) తెలిపారు. శుక్రవారం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ… స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. వందేమాతరం (Vande Mataram) గేయానికి 150 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో భారత ప్రభుత్వం వందేమాతరం స్మారక నాణేన్ని విడుదల చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పాలనాధికారి శ్రీనివాస్, సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

